హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయనిధి స్టాలిన్ విడుదల

తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఆయనను సుమారు గంటన్నర పాటు విచారించారు. విచారణ అనంతరం ఉదయనిధికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు. ఉదయనిధి అరెస్ట్‌తో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.