హైదరాబాద్: 28°C
వార్తలు

రెండో రోజు కొనసాగిన దీక్ష

ASR: గింజర్తి ఎంపీపీ పాఠశాలలో 1నుంచి 5వరకు తరగతులను కొనసాగించాలని విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్ష మంగళవారంతో రెండో రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరాన్ని ఎంఈవో సింహాచలం సందర్శించారు. 3, 4, 5వ తరగతులను తొలగించడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని గ్రామస్తులు ఎంఈవోకు వివరించారు. తరగతులను కొనసాగించే వరకు దీక్షను కొనసాగిస్తామన్నారు.