హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం.. హైఅలర్ట్

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. రేపు(ఆగస్టు 5న) ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా జాతీయ రహదారి వెంబడి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.