హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్-చైనా బంధంపై కీలక ప్రకటన

భారత్-చైనా సంబంధాలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయన్నారు. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కైలాస మానససరోవర్ యాత్ర, విమానయాన కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.