స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి రాజీనామా చేశారు. చేరిన 4 నెలల్లోనే ఆ పార్టీని వీడారు. బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని, రెండు పార్టీల రాజకీయాల్లో పెద్దగా తేడా లేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేతాజీ భావజాలాన్ని విస్మరించాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
బీజేపీ, టీఎంసీపై నేతాజీ మునిమనవడి అసంతృప్తి


