హైదరాబాద్: 28°C
వార్తలు

కేబుల్ పనులతో తాగునీటి పైప్‌లైన్ ధ్వంసం

KRNL: కోడుమూరులో ఎయిర్‌టెల్ కేబుల్ పనుల సందర్భంగా తాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 10 రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తుండగా ఈ ఘటనతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రోడ్లు, తాగునీటి పైపులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.