హైదరాబాద్: 28°C
వార్తలు

కన్సాలిడేటెడ్ ఫండ్ నిధులకు ఓకే

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్ బిల్లు-2026కు ఆమోదం లభించింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదనంగా ఖర్చు చేసిన మొత్తాలను భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకునేందుకు ఇది అనుమతిస్తుంది. అదనపు వ్యయాలు, రుణాల చెల్లింపుల కోసం కేంద్రం సుమారు రూ.54 వేల కోట్లకు పైగా మొత్తాన్ని కోరింది.