హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్‌ది జోకర్ కేబినెట్: స్టాలిన్

తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ 'X' వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కావేరి జలాలు తీసుకురాలేని, కనీసం మేకెదాటు డ్యామ్‌ను ఆపలేని దద్దమ్మ సీఎం అని విమర్శించారు. కావేరి జలాల సమస్యతో రైతులు కన్నీరు పెడుతుంటే.. మంత్రులు, సీఎం ఆయన నటించిన సినిమా చూసి ఏడుస్తున్నారని, తమిళనాడులో జోకర్ కేబినెట్ నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.