హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎల్లారెడ్డిలోనే మైనారిటీ జూనియర్ కళాశాల'

KMR: ప్రస్తుతం లింగంపేటలో కొనసాగుతున్న ఎల్లారెడ్డి మైనారిటీ జూనియర్ కళాశాలను ఎల్లారెడ్డిలోని చిన్న సతీష్ భవనంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించిందని ప్రిన్సిపల్ శారద తెలిపారు. ఎల్లారెడ్డి, పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కళాశాలలో అడ్మిషన్లు పొందాలని కోరారు.