హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

ADB: ఆదిలాబాద్ ఎయిర్ డ్రోమ్ ప్రాంతంలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ CI సునీల్ కుమార్ మంగళవారం తెలిపారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఈ బియ్యం, మ్యాక్స్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.