హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన ఉద్యోగాలపై జేఏసీ ఆందోళన

HYD: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు 75 శాతం ఉద్యోగాలు కేటాయించాలన్న జీవో నంబర్ 49ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని నిరుద్యోగుల జేఏసీ నాయకుడు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మాట్లాడుతూ ప్రభుత్వం జీవోను అమలు చేయడం లేదని ఆరోపించారు. గిరిజన యువతకు అన్యాయం జరుగుతోందని, గిరిజన నేతలు మౌనం వీడాలని కోరారు.