హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యామ్నాయ పంటల శిక్షణా కార్యక్రమం

VZM: బొండపల్లి మండలం గరుడబిల్లిలో ఆత్మ సౌజన్యంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. రైతులు తక్కువ కాలపరిమితి గల వరి, రాగులు సాగు చేసుకోవాలని సూచించారు. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల చీడ పీడలు దరిచేరవన్నారు. అలాగే పంట రక్షణ కోసం రైతులు తప్పనిసరిగా ఎకరాకు 200 రూపాయల చొప్పున బీమా చెల్లించాలని చెప్పారు.