హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తొమ్మిది మందికి జరిమానా

సత్యసాయి: జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.90 వేల జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మునీర్ అహ్మద్ హెచ్చరించారు.