BPT: కారంచేడు మండలం దగ్గుబాడు ఎంపీపీ పాఠశాలలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంకొల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో సులోచన రాణి మాట్లాడుతూ.. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు వ్యాధినిరోధక శక్తిని అందిస్తాయని అన్నారు. పుట్టిన గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు.
వార్తలు
'ప్రపంచ తల్లిపాల వారోత్సవాల' అవగాహన ర్యాలీ


