హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు

ATP: పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించిన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ.. తొలి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే సంపూర్ణ ఆహారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ వేణుగోపాల్‌, వైద్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.