హైదరాబాద్: 28°C
వార్తలు

స్వర్ణగ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో

ప్రకాశం: కంభం మండలంలోని తురిమెళ్ల స్వర్ణగ్రామాన్ని ఎంపీడీవో వీరభద్రాచారి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించి, కొనసాగుతున్న సర్వేల పురోగతిని సమీక్షించారు. సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.