హైదరాబాద్: 28°C
వార్తలు

'మౌలిక సదుపాయాలు కల్పించాలి'

PPM: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్వతీపురంలోని దళితవాడలను కేవీపీఎస్, సీఐటీయూ, ఐద్వా నాయకులు సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితవాడల్లో డ్రైనేజీ కాలువలు, మంచినీటి సౌకర్యం, స్మశానవాటికల రక్షణ గోడలు, బోర్లు, హౌస్ లోన్లు, ఉపాధి అవకాశాలు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.