మెటా గ్లోబల్ బృందంతో ఈనెల 5, 6 తేదీల్లో జరగనున్న భేటీలో కేంద్రం కీలక అంశాలపై వివరణ కోరనుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక దోపిడీ కంటెంట్ రావడం, ఏఐతో సృష్టిస్తున్న తప్పుడు సమాచారం, అల్గారిథమిక్ పక్షపాతం, ప్రముఖుల ఖాతాల భద్రతపై చర్చించనుంది. డిజిటల్ వేదికల్లో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ కోసం మెటా తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం నిలదీయనుందని సమాచారం.
వార్తలు
అల్గారిథమిక్ పక్షపాతం.. మెటాపై కేంద్రం సీరియస్!


