హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ కోసం ఎస్‌ఈకు వినతి

SDPT: మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామానికి 3-ఫేజ్ విద్యుత్ సరఫరా కల్పించాలని గ్రామ ప్రతినిధులు మంగళవారం సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం సమర్పించారు. 3-ఫేజ్ విద్యుత్ లేక రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, శాశ్వత పరిష్కారం చూపించి వెంటనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్నారు.