హైదరాబాద్: 28°C
వార్తలు

బురదమయంగా డైవర్షన్‌ రహదారి

KMM: మధిర మున్సిపాలిటీ 2వ డివిజన్‌ హనుమాన్‌ కాలనీ 3 రోడ్ల కూడలి వద్ద కల్వర్టు నిర్మాణంతో ఏర్పాటు చేసిన డైవర్షన్‌ రహదారి వర్షానికి బురదమయమైంది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారిపై కనీసం మట్టి పోసి ప్రయాణానికి అనువుగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.