హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌ను కలిసిన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు

VKB: తెలంగాణ స్టేట్ గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం సమర్పించారు. సీఆర్‌టీలకు రూ.28,900, ఎస్‌జీటీలకు రూ.22,500 వేతనం అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డులు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.