హైదరాబాద్: 28°C
వార్తలు

కృష్ణారావు సేవలు చిరస్మరణీయం: ఆర్‌డీఓ

SS: జిల్లా కలెక్టరేట్‌లో శ్రీ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్‌డీఓ సువర్ణ, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలుగు భాష, సాహిత్యం, విద్యా రంగం, సామాజిక సేవలకు వెంకట కృష్ణారావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆర్‌డీఓ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సక్సేనా పాల్గొన్నారు.