హైదరాబాద్: 28°C
వార్తలు

బస్టాండ్ సెంటర్లో ఇరుక్కున్న లారీ, ట్రాక్టర్

NLR: సంగం బస్ స్టాండ్‌ సెంటర్‌లో మంగళవారం లారీ, ఇసుక ట్రాక్టర్ ఇరుక్కున్నాయి. ఆ రెండు ఇరుక్కోవడంతో వాహనాల నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్సై భోజ్యా నాయక్ ఆధ్వర్యంలో క్రేన్, జేసీబీ సహాయంతో వాహనాలను తొలగించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు గోతులే ప్రమాదాలకు కారణమని తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.