హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం'

ATP: గుత్తి పట్టణంలోని కోటవీధిలో మంగళవారం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. సూపర్‌వైజర్ దస్తగీరమ్మ మాట్లాడుతూ.. పిల్లలకు డబ్బా పాలు తాగించకుండా తల్లిపాలను తాగించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు సంపూర్ణ ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం వల్ల పౌష్టిక ఆహారం అందించనున్నట్లు తెలిపారు.