ప్రకాశం: కనిగిరి మండలంలోని జమ్మలమడక అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆమె సూచించారు. అనంతరం తల్లిపాల ప్రాధాన్యంపై ప్రతిజ్ఞ చేసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
వార్తలు
జమ్మలమడకలో తల్లిపాల వారోత్సవాలు


