హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల పాఠశాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

PLD: మాచర్ల మండలం విజయపురి సౌత్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్. వాణిరాణి మంగళవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కలిశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను వినతిపత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.