GNTR: ఫిరంగిపురం (మం) పొనుగుపాడులోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గ్రామ సచివాలయ అధికారులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. కాలనీలకు ఉన్న స్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరారు.
వార్తలు
ఎస్సీ, ఎస్టీ కాలనీల సమస్యలపై వినతి


