హైదరాబాద్: 28°C
వార్తలు

అగ్రహారంలో రక్షణ గోడ నిర్మాణం ప్రారంభం

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారంలోని దళితవాడలో ముంపు సమస్య నివారణకు గెడ్డ వద్ద రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలంలో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా పరిషత్ రూ.5 లక్షలు మంజూరు చేసింది. నిధులతో పనులు వేగంగా కొనసాగుతుండగా, ముంపు సమస్య తొలగుతుందనే ఆశతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.