SRD: ఇంకుడు గుంతలతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ అన్నారు.మండలంలోని నిజాంపూర్ పాఠశాలలో వర్షం నీరు వృథాగా పోతుండడం గమనించి నీటిని పొదుపు చేసేందుకు పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు తాగునీరు అందాలంటే ఇంకుడు గుంతలే శరణ్యం అని తెలియజేశారు.
వార్తలు
ఇంకుడు గుంతలతో ప్రయోజనం


