NGKL: తాడూరు మండలం సిర్సవాడలో దుందుభి నది నీరు లేక కళతప్పింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువకపోవడంతో ఈ నదిపై నిర్మించిన చెక్ డ్యాములో నీరు లేక వెలవెలబోతున్నాయి. దుందుభి నది పరిస్థితులను చూసి నది పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఉంటే భూగర్భ జలాలు అడుగంటిపోయి, పంటలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానిక రైతులు అంటున్నారు.
వార్తలు
సిర్సవాడలో కళ తప్పిన దుందుభి నది


