హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాకు భారీ వర్ష సూచన

E.G: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని తెలిపింది. గాలుల నేపథ్యంలో చెట్ల కింద, పాతబడ్డ భవనాల కింద ఉండరాదని హెచ్చరించింది. అధికారుల సూచనలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరింది.