హైదరాబాద్: 28°C
వార్తలు

'కౌకుంట్లలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి'

మహబూబ్ నగర్: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడిచినా ఇప్పటికీ సొంత పోలీస్ స్టేషన్ లేక మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శాంతిభద్రతల సమస్యల కోసం దేవరకద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కౌకుంట్ల మండల కేంద్రంలో వెంటనే పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.