హైదరాబాద్: 28°C
వార్తలు

సుభాష్‌నగర్‌లో వరద ఇల్లు పరిశీలించిన మేయర్

కరీంనగర్ 26వ డివిజన్ సుభాష్‌నగర్‌లో రాత్రి వర్షానికి నీరు చేరిన ఇంటిని మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు. నీటిని తొలగించి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వర్షాకాలంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్పొరేటర్ అంజన్ కుమార్, అధికారులు ఇందులో పాల్గొన్నారు.