హైదరాబాద్: 28°C
వార్తలు

అరుదైన అలుగు జంతువు కలకలం

KDP: కమలాపురం పంచాయతీ కుమ్మరి వీధిలో అరుదైన అలుగు (పాంగోలిన్) జంతువు కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు జంతువును సురక్షితంగా పట్టుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకునే ఈ అరుదైన క్షీరదం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జాతిగా గుర్తింపు పొందింది.