హైదరాబాద్: 28°C
వార్తలు

సింగూర్‌లో స్వల్పంగా తగ్గిన నీటి నిల్వలు

SRD: సింగూర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఉదయానికి డ్యామ్‌లో 515.175 మీటర్ల నీరుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.181 టీఎంసీల నీరుంది. గడిచిన 24 గంటల్లో ఇన్‌ఫ్లో 178, అవుట్‌ఫ్లో 380 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి విడుదల ఎక్కువగా ఉండటంతో నిల్వలు తగ్గుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.