హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వేట.. మత్స్యకారులకు లాభాల పంట

KKD: యూ.కొత్తపల్లి మండల మత్స్యకారుల పంట పండింది. అమీనాబాద్ రేవు నుంచి సోమవారం వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ కాలంలో తక్కువగా లభించే సందువా చేపలు దొరికాయి. 20 కి పైగా బోట్లకు ఇవి లభించాయని, దేనికి ఒకటే ముళ్ళు ఉండడంతో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ మంచి డిమాండ్ ఉందని తెలిపారు. వీటిని రాత్రివేళ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు.