హైదరాబాద్: 28°C
వార్తలు

మానవత్వం చాటుకున్న టీడీపీ ఇన్‌ఛార్జ్!

ప్రకాశం జిల్లా అద్దంకిలోని దర్శి రోడ్డులో మోటార్ సైకిల్‌ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అటు వైపు నుంచి వెళ్తున్న దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ లక్ష్మి ఆమె భర్త సాగర్ 108 వాహనాన్ని పిలిపించి వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తర్వాత వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానిక అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు.