హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం డ్యామ్‌కు పెరుగుతున్న వరద

AP: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,16,762 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 857.70 అడుగులు ఉంది. పూర్తిస్థాయిలో వరద నీరు వచ్చి చేరితే గేట్లు ఎత్తి దిగువన సాగర్‌కు నీటిని విడుదల చేసే ఛాన్స్ ఉంది. జూరాల డ్యామ్ 27 గేట్లు ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.