హైదరాబాద్: 28°C
వార్తలు

వానలతో కళకళలాడుతున్న డెల్టా..!

WG: గోదావరి డెల్టా ప్రాంతంలో ఆగస్టు వర్షాలతో పచ్చదనం పరుచుకుంటోంది. వరి నారుమడులు, నాట్లు, కాలువల్లో నీటి ప్రవాహంతో ప.గో. రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఖరీఫ్ పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.