HNK: ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని గ్రామస్థులు ఆరోపించారు. వాగులోని మంచినీటి బావి సమీపంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండటంతో బావికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
వార్తలు
అక్రమ ఇసుక రవాణాపై గ్రామస్థుల ఆందోళన


