హైదరాబాద్: 28°C
వార్తలు

గుజరాత్‌లో చాందీపురా వైరల్ కలకలం

గుజరాత్‌లో చాందీపురా వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల 35 మందికి ఈ వైరస్ సోకగా.. అందులో దాదాపు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్‌ పన్‌సెరియా వెల్లడించారు. మొత్తం 184 అనుమానిత కేసులను గుర్తించినట్లు చెప్పారు. గాంధీనగర్, రాజ్‌కోట్, ఇతర జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ఏడుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు.