హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ టేకు కలప పట్టివేత.. బొలేరో స్వాధీనం

MLG: వెంకటాపురం మండలం రామచంద్రాపురం వద్ద సోమవారం అటవీశాఖ అధికారులు బొలేరో వాహనంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 11 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇద్దరు నిందితులు వాహనం వదిలి పరారవగా, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.