హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసులపై శాఖాపరమైన విచారణ : ASP

KDP: తిరుపతికి చెందిన యువతుల నుంచి రూ. 50 వేల వసూలు చేశారన్న ఆరోపణలపై ప్రొద్దుటూరు పోలీసులు శ్రీనివాసులు, దస్తగిరి, సాయిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు స్థానిక ఏఎస్పీ విభుకృష్ణ సోమవారం తెలిపారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే అంతర్గత విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.