మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. అత్యధికంగా పాపన్నపేటలో 65 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. శివంపేట (53.5), కొల్చారం (48.8), కౌడిపల్లి (42.9), పెద్దశంకరంపేట (42.8) మండలాల్లో వాన హోరెత్తింది. టేక్మాల్, మెదక్, తూప్రాన్ ప్రాంతాల్లోనూ చక్కటి వర్షం పడింది. ఈ పదును వానలతో వరి, పంట చేలకు జీవం రావడంతో జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.
వార్తలు
జిల్లా భారీ వర్షం.. రైతన్న హర్షం


