హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు  పొగాకు కొనుగోలును పరిశీలించనున్న జగన్

AP: మాజీ CM జగన్‌ ఈనెల 5న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు ఆ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. పొగాకు రైతులతో ముఖా­ముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలు తదితర అంశాలను నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారు.