హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. UPI లావాదేవీలపై రుసుములు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. రూ.3,000 దాటిన UPI చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్ రేటు (MDR) వర్తింపచేసేందుకు ప్రభుత్వం, RBI పరిశీలిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. డిజిటల్‌ చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని తేల్చి చెప్పింది.