TG: రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. హైడ్రా అంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.
వార్తలు
రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉంది: ఈటల


