హైదరాబాద్: 28°C
వార్తలు

పులులు మృతి.. హై లెవల్ కమిటీ ఏర్పాటు

AP: పులుల మరణాలపై విచారణకు ప్రభుత్వం హై లెవల్ కమిటీ వేసింది. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల మరణాలపై కమిటీ నియమిస్తూ జీవో జారీ చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. వేట నిరోధక చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది.