హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. రిజర్వాయర్లు, నీటి వనరుల్లో నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. కృష్ణా వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని తెలిపారు. పశుగ్రాసకొరతపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.