హైదరాబాద్: 28°C
వార్తలు

నేరేడుచర్లలో పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

SRPT: నేరేడుచర్ల మండలం కల్లూరు శివారులో నిర్వహిస్తున్న అందర్–బాహర్ పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఎస్సై గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,500 నగదు, 52 పేకముక్కలు, మూడు సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.